Share News

లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:42 AM

నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌లో సోమవారం ఉదయం ఒక లారీ సాంకేతిక సమస్యతో రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో నాలుగు గంటలపాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.

లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌
లంబసింగి ఘాట్‌లో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన లారీ

నాలుగు గంటలపాటు నిలిచిపోయిన రాకపోకలు

చింతపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌లో సోమవారం ఉదయం ఒక లారీ సాంకేతిక సమస్యతో రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో నాలుగు గంటలపాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీని పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సోమవారం ఉదయం నర్సీపట్నం నుంచి సిమెంట్‌ లోడ్‌తో ఒక లారీ ఒడిశా వెళుతోంది. లంబసింగి ఘాట్‌ బోడకొండమ్మ ఆలయం సమీపంలో సాంకేతిక సమస్య కారణంగా ఆగిపోయింది. రహదారి మధ్యలో లారీ ఉండిపోవడంతో భారీ వాహనాలు ఇరువైపులా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ జి.వీరబాబు, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు సిబ్బందితో లంబసింగి ఘాట్‌కి వెళ్లారు. లారీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రహదారి పక్కకు పెట్టించారు. దీంతో నాలుగు గంటలు తరువాత రాకపోకలు యథావిధిగా సాగాయి. ట్రాఫిక్‌ జామ్‌ వల్ల కొన్ని వాహనాలు కృష్ణాదేవిపేట, రంపుల ఘాట్‌ మీదుగా రాకపోకలు సాగించాయి.

Updated Date - Jun 30 , 2026 | 12:42 AM