Share News

లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:13 AM

నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌ తొలి మలుపు వద్ద సాంకేతిక సమస్యలో భారీ లారీ నిలిచిపోయింది.

లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం
లంబసింగి ఘాట్‌లో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన లారీ

సాంకేతిక సమస్యతో లారీ నిలిచిపోయి ఇబ్బందులు

చింతపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌ తొలి మలుపు వద్ద సాంకేతిక సమస్యలో భారీ లారీ నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం మధ్యాహ్నం మైదాన ప్రాంతాల నుంచి ఓ లారీ సిమెంట్‌ లోడుతో చింతపల్లి వస్తున్నది. లంబసింగి ఘాట్‌ తొలిమలుపు వద్ద సాంకేతిక సమస్యతో లారీ నిలిచిపోయింది. ఈ మలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండడంతో భారీ వాహనాలు, బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.

Updated Date - Jul 30 , 2026 | 12:13 AM