Share News

సంప్రదాయ దస్తులు ధరిస్తేనే అప్పన్న దర్శనం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:16 AM

హైందవ సంప్రదాయంలో అంతర్భాగమైన సంప్రదా య దుస్తులు ధరించిన వారికి మాత్రమే సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనం లభించనుంది.

సంప్రదాయ దస్తులు ధరిస్తేనే అప్పన్న దర్శనం

రేపటి నుంచి అమలు: ఈవో

సింహాచలం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

హైందవ సంప్రదాయంలో అంతర్భాగమైన సంప్రదా య దుస్తులు ధరించిన వారికి మాత్రమే సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనం లభించనుంది. ఈ విధానాన్ని డిసెంబరు ఒకటో తేదీ నుంచి కఠినంగా అమ లు చేస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులంతా తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి అప్పన్న దర్శనానికి రావాలని, ఈ విషయంపై ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం చేశామన్నారు.

సాధారణ దర్శనానికి వచ్చే పురుషులు ధోవతితోపాటు అంగవస్త్రం, లేదా కుర్తా పైజమా లేదా సంప్రదాయబద్దమైన షర్టు, ప్యాంటు ధరించాలన్నారు. మహిళలు చీర, లంగావోణీ, (హాఫ్‌శారీ), లేదా దుపట్టాతో కూడిన చుడీదార్‌లను ధరిస్తేనే ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు. షార్టు (నిక్కర్లు), టీ-షర్టులు, స్లీవ్‌లెస్‌ టాప్స్‌, వెస్ట్రన్‌ దుస్తులు ధరించి వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదన్నారు.


నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ రద్దు

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున 30వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దుచేసినట్టు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. అర్జీదారులు గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.

నేడు, రేపు సామాజిక పింఛన్లు పంపిణీ

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కేటగిరీల సామాజిక పింఛన్లను సోమ, మంగళవారాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,55,719 మంది లబ్ధిదారులకు రూ.70.04 కోట్లు మంజూరయింది. నాలుగు మండలాల్లో 25,867 మంది లబ్ధిదారులకు రూ.11.09 కోట్లు, జీవీఎంసీ పది జోన్ల పరిధిలో 1,29,852 మందికి రూ.58.94 కోట్లు సోమవారం ఉదయం బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి స్వర్ణగ్రామ/స్వర్ణవార్డు సిబ్బందికి అందజేస్తారు. అనంతరం పింఛన్‌దారులకు పంపిణీ చేస్తారు. పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈసీ నిబంధనలు పాటించాలని డీఆర్‌డీఏ పీడీ బెందాళం లక్ష్మీపతి సూచించారు.

Updated Date - Nov 30 , 2026 | 01:16 AM