లంబసింగికి పర్యాటకుల సందడి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:11 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.
చింతపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. లంబసింగి జంక్షన్, చెరువులవేనం, భీమనాపల్లి, తాజంగి జలాశయం వద్దకు ఉదయం ఆరు గంటలకే పర్యాటకులు చేరుకున్నారు. పదకొండు గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహసక్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. సాయంత్రం ఆరు గంటల వరకు స్ట్రాబెర్రీ తోటలు, లంబసింగి పరిసర సందర్శక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.