అరకులోయలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:30 PM
అందాల అరకులోయలో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. గాంధీజయంతి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో సందర్శకులు పెద్ద ఎత్తున అరకులోయ తరలివచ్చారు.
గాంధీ జయంతి సెలవు కావడంతో పోటెత్తిన సందర్శకులు
ప్రకృతి అందాలను ఆస్వాదించిన పర్యాటకులు
అరకులోయ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
అందాల అరకులోయలో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. గాంధీజయంతి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో సందర్శకులు పెద్ద ఎత్తున అరకులోయ తరలివచ్చారు. ఘాట్‌రోడ్డు సందర్శకుల వాహనాలతో రద్దీగా మారింది. గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి, అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ను సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించారు. ముఖ్యంగా గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాల నడుమ సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అదేవిధంగా సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి వద్ద ప్రకృతి ప్రేమికులు కాఫీ తోటల్లో మిరియాల పాదులతో ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే సిల్వర్‌ఓక్ వృక్షాల అందాలను ఆస్వాదించారు. ఉడెన్ బ్రిడ్జి వద్ద ఫొటోలు దిగారు. మరికొందరు కాఫీతోటల మధ్య ఉన్న ట్రీ-రెస్టారెంట్‌లో ఇష్టమైన ఫుడ్ తింటూ.. కాఫీహౌస్‌లో కాఫీ తాగుతూ గడిపారు. సందర్శకుల రద్దీ ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉంది.