Share News

అరకులోయలో పర్యాటకుల సందడి

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:22 PM

అందాల అరకులోయను శనివారం పర్యాటకులు ఓ మోస్తరుగా సందర్శించారు.

అరకులోయలో పర్యాటకుల సందడి
సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి ముఖద్వారం వద్ద సందర్శకులు సందడి

ఉడెన్‌ బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌ల సందర్శన

ప్రకృతి అందాల నడుమ ఫొటోలు దిగిన సందర్శకులు

అరకులోయ,సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అందాల అరకులోయను శనివారం పర్యాటకులు ఓ మోస్తరుగా సందర్శించారు. గాలికొండ వ్యూపాయింట్‌, సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి వద్ద సందర్శకులు సందడి చేశారు. గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద ప్రకృతి అందాల నడుమ ఫొటోలు దిగుతూ కనిపించారు. అదేవిధంగా సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి ను పెద్ద ఎత్తున సందర్శించారు. కాఫీతోటలు, సిల్వర్‌ ఓక్‌ మొక్కలు, వాటికి చుట్టుకుని ఉన్న మిరియాల పాదుల నడుమ ఉన్న ఉడెన్‌ బ్రిడ్జిపై నడుస్తూ ఫొటోలు దిగారు. బర్డ్‌నెస్ట్‌, ఫొటో ఫ్రేం, ట్రీ-డెక్‌ల వద్ద ఫొటోలు దిగుతూ కనిపించారు. అలాగే అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్‌ను పర్యాటకులు సందర్శించారు. ఆటోవాలాలు, ట్యాక్షీ వాలాలు, చిరువ్యాపారులకు వ్యాపారం సాగింది.

Updated Date - Sep 19 , 2026 | 11:22 PM