డల్లాపల్లిలో టూరిజం కాటేజీలు
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:32 AM
మండలంలోని డల్లాపల్లి గ్రామంలో టూరిజం కాటేజీలు నిర్మిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ తెలిపారు. మండలంలోని సలుగు పంచాయతీ డల్లాపల్లి గ్రామంలో టూరిజం కాటేజీల నిర్మాణానికి మంగళవారం ఆమె భూమి పూజ చేశారు.
- జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ వెల్లడి
- నిర్మాణాలకు భూమి పూజ
పాడేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డల్లాపల్లి గ్రామంలో టూరిజం కాటేజీలు నిర్మిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ తెలిపారు. మండలంలోని సలుగు పంచాయతీ డల్లాపల్లి గ్రామంలో టూరిజం కాటేజీల నిర్మాణానికి మంగళవారం ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎత్తైన సుందర ప్రదేశంగా, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన డల్లాపల్లిలో టూరిజం, స్వయం సహాయ సంఘాల సంయుక్త నిర్వహణలో కాటేజీల నిర్మాణం జరుగుతుందన్నారు. పర్యావరణ హితంగా ఇక్కడ పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతారన్నారు. డల్లాపల్లిలో పర్యాటకాభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత ప్రాచుర్యం పొందుతుందని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకాధికారి పి.చలపతిరావు, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో తేజ్‌రతన్, తదితరులు పాల్గొన్నారు.