అరకులోయలో కుండపోత
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:47 PM
అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. మూడు గంటలకు ఉరుములతో ప్రారంభమైన వర్షం సాయంత్రం ఆరు గంటల వరకు వర్షం పడింది.
మూడు గంటలపాటు భారీ వర్షం
చలబడిన పట్టణం
అరకులోయ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. మూడు గంటలకు ఉరుములతో ప్రారంభమైన వర్షం సాయంత్రం ఆరు గంటల వరకు వర్షం పడింది. అనంతరం జల్లులు పడుతునే ఉన్నాయి. దీంతో పట్టణవాసులు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. గత కొన్నిరోజులుగా మైదానప్రాంతాలకు దీటుగా ఎండలు కాస్తుండడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. శనివారం మోస్తరు వర్షం పడగా.. ఆదివారం కుండపోతగా వర్షం కురిసింది.
ముంచంగిపుట్టులో గాలివాన
ముంచంగిపుట్టు మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.