టమాటా ధర ఢమాల్
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:03 AM
టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు దిగజారిపోయింది.
కిలో రూ.26 నుంచి రూ.11లకు పడిపోయిన ధర
30 కిలోల క్రేటు రూ.330 నుంచి రూ.350ల మధ్య విక్రయం
కృష్ణాదేవిపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు దిగజారిపోయింది. గత వారం కృష్ణాదేవిపేట మార్కెట్‌లో క్రేటు(30 కిలోలు) రూ.800 పలకగా, ఈ ఆదివారం రూ.330 నుంచి రూ.350 మధ్య అమ్మకాలు సాగాయి. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇదే క్రేటు రూ.1000లకు పైబడి ధర పలికింది. ఆదివారం కృష్ణాదేవిపేట మార్కెట్‌కు కొయ్యూరు, గొలుగొండ మండలాల్లో గల ఏఎల్‌పురం, చోద్యం, గైరంపేట, లింగంపేట, పాడి, రత్నంపేట, కినపర్తి, వలసంపేట, భీమవరం, పి.మాకవరం, సీహెచ్ నాగాపురం, తదితర గ్రామాల రైతులు వందలాది కిలోల టమాటాను తెచ్చారు. అయితే సరైన ధర పలకకపోయినా వ్యాపారులకు విక్రయించారు. ధర రోజురోజుకూ తగ్గిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.