Share News

టమాటా రైతు కుదేలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:57 AM

టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. సుమారు 30 కిలోలు బరువుండే క్రేట్‌ టమాటాలు కృష్ణాదేవిపేట మార్కెట్‌లో రూ.60, అనకాపల్లి మార్కెట్‌లో రూ.90 రేటు మాత్రమే పలికాయి. అయినాసరే మార్కెట్‌కు తెచ్చిన సరుకులో కొంతమేర మిగిలిపోయింది. జిల్లాలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ఈ ఏడాది టమాటా సాగు అధిక విస్తీర్ణంలో చేపట్టారు. సాధారణంగా డిసెంబరు చివరి వారం నుంచి పంట దిగుబడి రావడం మొదలవుతుంది.

టమాటా రైతు కుదేలు
కృష్ణాదేవిపేటలో టమాటా క్రేట్లతో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

దారుణంగా పతమైన ధర

కిలో రూ.2-3కు పడిపోయిన వైనం

కృష్ణాదేవిపేటలో 30 కిలోల క్రేట్‌ రూ.60-70

అనకాపల్లిలో రూ.90-100

అయినా పూర్తిగా అమ్ముడుపోను పరిస్థితి

కోత కూలి డబ్బులు కూడా రావని సాగుదారుల ఆవేదన

అనకాపల్లి టౌన్‌/ కృష్ణాదేవిపేట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. సుమారు 30 కిలోలు బరువుండే క్రేట్‌ టమాటాలు కృష్ణాదేవిపేట మార్కెట్‌లో రూ.60, అనకాపల్లి మార్కెట్‌లో రూ.90 రేటు మాత్రమే పలికాయి. అయినాసరే మార్కెట్‌కు తెచ్చిన సరుకులో కొంతమేర మిగిలిపోయింది. జిల్లాలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ఈ ఏడాది టమాటా సాగు అధిక విస్తీర్ణంలో చేపట్టారు. సాధారణంగా డిసెంబరు చివరి వారం నుంచి పంట దిగుబడి రావడం మొదలవుతుంది. కానీ గత ఏడాది మొంథా తుఫాన్‌ కారణంగా టమాటా సాగు నెలకుపైగా ఆలస్యమైంది. సంక్రాంతి తరువాత నుంచి కాయ దిగుబడి రావడం మొదలైంది. రెండు వారాల నుంచి అన్నిచోట్లా కాయ కోతలు మొదలవడంతో మార్కెట్లకు టమాటాల రాకపెరిగింది. దీంతో ధరలు క్రమేపీ ్గముఖం పట్టాయి. 30 కిలోల క్రేట్‌ టమాటాలు నెల క్రితం రూ.400 పలకగా, ఇప్పుడు రూ.100 కూడా దాటడం లేదు. అనకాపల్లి కూరగాయల మార్కెట్‌కు ఆదివారం ఉదయం పలువురు రైతులు టమాటాలను తీసుకువచ్చారు. తొలుత క్రేట్‌ టమాటాలు రూ.100కు చిరువ్యాపారులు, హోటళ్లు, టిఫన్‌ సెంటర్లు నిర్వాహకులు కొనగోలు చేశారు. తొమ్మిది గంటలైనా చాలా వరకు సరుకు అమ్ముడుపోలేదు. దీంతో మరో పది రూపాయలు తగ్గించి రూ.90 చొప్పున ఇచ్చేశారు. కోత కూలి, రవాణా చార్జీలు కూడా రావని పలువురు రైతులు వాపోయారు.

ఇక కృష్ణాదేవిపేట మార్కెట్‌కు కొయ్యూరు, గొలుగొండ మండలాల్లోని పలు గ్రామాల రైతులు పదుల సంఖ్యలో టమాటా క్రేట్లు తెచ్చారు. అవసరాలకు మించి టమాటాలు రావడంతో దళారులు, చిరువ్యాపారులు ధరలు తగ్గించేశారు. 30 కిలోల క్రేట్‌ టమాలు రూ.60 నుంచి రూ.70 వరకు అమ్మకాలు సాగాయి. గత వారంతో పోలిస్తే ధరలు 50 శాతానికిపైగా తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సగం సొమ్ము ఆటో చార్జీలు, మార్కెట్‌ ఆశీలుకే పోతుందని, ఇక తమకు మిగిలేది ఏమీ వుండదని వాపోయారు.

కోత, రవాణా ఖర్చులు కూడా రావు

దామరౌతు సత్యవతి, విసన్నపేట, కశింకోట మండలం

టమాటా ధరలు ఇంతలా పడిపోవడం ఎన్నడూ చూడలేదు. కనీసం కాయ కోత కూలి ఖర్చులు కూడా రావు. మా ఊరు నుంచి అనకాపల్లి తీసుకురావడానికి క్రేట్‌కు రూ.25 ఆటో చార్జి, మార్కెట్‌లో ఆశీలు రూ.10 చొప్పున చెల్లిస్తున్నాం. ఇంటికి తిరిగి వెళ్లడానికి ఆటో చార్జీ రూ.50. ఒక కూలి రోజుకు పది క్రేట్ల టమాటాలు కోయగలరు. రూ.350 కూలి అవుతుంది. మొత్తంగా పది క్రేట్లకు కూలి, రవాణా, ఆశీలు కలిపి రూ.750కు పైగా అవుతున్నది. మార్కెట్‌లో అమ్మితే రూ.950 వచ్చాయి. ఇక మాకు మిగిలేది ఏమిటి?

ౖఫొటోః1ఎన్‌కేపీ4: డొంకాడలో టమాటా పంటను పీకేసిన దృశ్యం.

1ఎన్‌కేపీ4ఏః (ఇన్‌సెట్‌లో) రైతు ప్రగడ వెంకట రమణ

ఽధరలేక.. పంటను పీకేసి..

నక్కపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): టమాటా ధర భారీగా పడిపోవడ ంతో మండలానికి చెందిన పలువురు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నక్కపల్లి మండలం డొంకాడలో ప్రస్తుతం సుమారు 100 ఎకరాల్లో రైతులు టమోటా పంట వేశారు. సుమారు రెండు వారాల నుంచి కాయలు కోస్తున్నారు. వీటిని కాకినాడ జిల్లా తుని మార్కెట్‌లో విక్రయ్తింటారు. కానీ గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. శనివారం మరీ ఘోరంగా కిలో రూ.4 మాత్రమే ధర పలకడంతో ప్రగడ వెంకట రమణ, ప్రగడ శ్రీను తాము సాగు చేపట్టిన రెండు ఎకరాల్లో టమాటా పంటను పీకివేశారు. ఈ ధర అయితే పెట్టుబడి, తమ శ్రమ అటుంచి.. కనీసం కోత కూలి, రవాణా ఖర్చులు, మార్కెట్‌ ఆశీలు కూడా రావని వాపోయారు.

Updated Date - Mar 02 , 2026 | 12:57 AM