నేడు వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:45 AM
స్థానిక మెయిన్‌రోడ్డులోని వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని శనివారం భారీ ఎత్తున నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం తెల్లవారుజామున గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉత్సవంలో భాగంగా మెయిన్‌రోడ్డులో పలుచోట్ల రకరకాల విద్యుత్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.
భారీ ఎత్తున ఏర్పాట్లు
మెయిన్‌రోడ్డులో విద్యుత్ సెట్టింగులు, తోరణాలు
ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు
అనంతరం భక్తులకు దర్శనాలు
రాత్రికి పలుచోట్ల సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు
అనకాపల్లి టౌన్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెయిన్‌రోడ్డులోని వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని శనివారం భారీ ఎత్తున నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం తెల్లవారుజామున గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉత్సవంలో భాగంగా మెయిన్‌రోడ్డులో పలుచోట్ల రకరకాల విద్యుత్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. మెయిన్‌రోడ్డు మొత్తం విద్యుత్ తోరణాలు కట్టారు. శనివారం రాత్రి ఎస్‌బీఐ, పూడిమడకరోడ్డు, మల్లిమణుగులవారివీధి, ఎన్టీఆర్ స్టేడియం, రామచంద్ర థియేటర్, శారదా వంతెన, నెహ్రూచౌక్ బస్టాప్, రాతి మేడ, చిన నాలుగురోడ్ల జంక్షన్, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల వద్ద వివిధ రకాల సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, జానపద కళారూపాలను ప్రదర్శించడానికి స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. గౌరమ్మ ప్రసాదం ఉచితం పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో వినూత్న రీతిలో బాణసంచా కాల్పుల కార్యక్రమం వుంటుందని ఉత్సవ కమిటీ చైర్మన్ గరికి వెంకటరావు తెలిపారు. కాగా ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ చెప్పారు.