నేడు సాగర్‌నగర్‌లో ’అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:16 AM
ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ‘ఆంధ్రజ్యోతి’...వాటి పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకుసాగుతోంది.
సాగర్‌నగర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ‘ఆంధ్రజ్యోతి’...వాటి పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు-ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య వారధిగా శనివారం నగరంలోని సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. టెంపుల్ కాంప్లెక్స్‌లోని షిర్డీసాయి సాగరేశ్వర ఫంక్షన్‌హాలులో ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరవుతున్నారు. ఇంకా జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్, ఈపీడీసీఎల్, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. సాగర్‌నగర్‌లో ఉన్న సమస్యలను స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురానున్నారు.