Share News

నేడు, రేపు టీడీపీ మహానాడు

ABN , Publish Date - May 27 , 2026 | 12:06 AM

తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాంతంలో టీడీపీ మహానాడు నిర్వహించడం, అక్కడకు అందరు నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లడం జరిగేది.

నేడు, రేపు టీడీపీ మహానాడు
మహానాడు ర్యాలీకి జెండాలను సిద్ధం చేస్తున్న పాడేరు టీడీపీ శ్రేణులు

- జిల్లాలో క్లస్టర్ల వారీగా నిర్వహణకు సన్నాహాలు

పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాంతంలో టీడీపీ మహానాడు నిర్వహించడం, అక్కడకు అందరు నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లడం జరిగేది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం, పొదుపు మంత్రం నేపథ్యంలో రాష్ట్ర స్థాయి మహానాడును వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా క్యాడర్‌ వీక్షించనుంది. ప్రతి మండలంలో క్లస్టర్ల వారీగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఐదు మండలాల్లోని పది క్లస్టర్ల పరిధిలో, అరకులోయ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో పన్నెండు క్లస్టర్ల పరిధిలో ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 27 , 2026 | 12:07 AM