రేషన్ కావాలంటే గెడ్డ దాటాల్సిందే..
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:58 PM
మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ తారాబు గ్రామస్థులు రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటాల్సిన దుస్థితి నెలకొంది.
తారాబు గ్రామస్థులకు తప్పని ఇబ్బందులు
పెదబయలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ తారాబు గ్రామస్థులు రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం వీరంతా ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటి సాకిరేవు గ్రామానికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకున్నారు. మత్స్యగెడ్డపై వంతెన నిర్మిస్తే తమకు ఇబ్బందులు తీరతాయని, లేకుంటే అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలన్నా ప్రాణాలకు తెగించి గెడ్డ దాటాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.