Share News

వినతులకు సకాలంలో పరిష్కారం

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:26 PM

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ప్రజలు సమర్పించిన వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు.

వినతులకు సకాలంలో పరిష్కారం
మీకోసం కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, తదితరులు

ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశం

పీజీఆర్‌ఎస్‌లో 102 వినతుల స్వీకరణ

పాడేరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ప్రజలు సమర్పించిన వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్జీలను పక్కాగా పరిశీలించి, విచారణ జరిపి సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులు సమర్పించిన వినతులు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు కాల్‌ చేయాలని శ్రీపూజ సూచించారు. అర్జీదారులు కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌: క్ఛ్ఛజుౌట్చఝ.్చఞ.జౌఠి.జీుఽ సంప్రదించవచ్చునన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో 102 అర్జీలు

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, ఆర్డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావులకు ప్రజలు 102 వినతులను సమర్పించారు. ఆయా వినతులను సంబంధిత శాఖలకు బట్వాడా చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ వీఏ.స్వామినాయుడు, డీఈవో కె.రామకృష్ణారావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఆర్‌వీ.రమణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీవీ.పరిమిళ, డీపీవో చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జి.ప్రసాద్‌, సీపీవో ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 10:26 PM