సకాలంలో అర్జీలు పరిష్కారం
ABN , Publish Date - May 01 , 2026 | 11:16 PM
మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
సమస్యపై అవగాహన ఉండాలి
పీజీఆర్‌ఎస్‌లో 93 వినతులు స్వీకరణ
పాడేరు, మే 1 (ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి ఆమెమాట్లాడారు. అర్జీల పరిష్కారంలో కాలయాపన చేయవద్దని, వాటిని సకాలంలోనే పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యపై అధికారులకు కచ్చితమైన అవగాహన ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నదని, అధికారులు పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 93 వినతులను స్వీకరించారు. అర్జీదారులు తమ సమస్యపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ నీలకంఠరావు, డీఆర్‌డీఏ డైరెక్టర్ వి.మురళీ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయిక్, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్ జి.దాసు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, నేషనల్ హైవే డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.