Share News

అర్జీలకు గడువులోగా పరిష్కారం

ABN , Publish Date - May 23 , 2026 | 12:21 AM

పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

అర్జీలకు గడువులోగా పరిష్కారం
పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 104 వినతులు స్వీకరణ

పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించినప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం(మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన వినతులను పక్కాగా పరిశీలించాలన్నారు. వాటిని గడువులోగా పరిష్కరించేందుకు కృషిచేయాలని, ఈక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించి, గామ స్థాయి సమస్యలపై అక్కడే పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నదని, ఈక్రమంలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 104 వినతులను స్వీకరించారు. మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్‌ కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, పీఆర్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్‌ జి.దాసు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:21 AM