Share News

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:06 AM

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే పక్కా చర్యలు చేపట్టామని విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి తెలిపారు. ఆయన మంగళవారం ఎలమంచిలి సర్కిల్‌, అడ్డురోడ్డులోని నక్కపల్లి సర్కిల్‌ కార్యాలయంతోపాటు ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి తనిఖీ చేశారు.

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందికి సూచనలిస్తున్న విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి

విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి

ఎలమంచిలి, నక్కపల్లి సర్కిళ్లలో తనిఖీలు

ఎలమంచిలి/ ఎస్‌.రాయవరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే పక్కా చర్యలు చేపట్టామని విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి తెలిపారు. ఆయన మంగళవారం ఎలమంచిలి సర్కిల్‌, అడ్డురోడ్డులోని నక్కపల్లి సర్కిల్‌ కార్యాలయంతోపాటు ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రతి మండలంలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల్లో భాగంగా ప్రత్యేక పోలీస్‌ బలగాలను, స్రైకింగ్‌ ఫోర్సులను సిద్ధం చేశామన్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించినట్టు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలీస్‌ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళిక చేశామన్నారు. గ్రామాల్లో ఇప్పటికే వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి ఎటువంటి గొడవలు లేకుండా బైండోవర్‌ తీసుకున్నామన్నారు. ఆయన వెంట నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు ఎల్‌.రామకృష్ణ, మురళి, చక్రధరరావు, ఎస్‌ఐలు ఎస్‌.రమేశ్‌, విజయ్‌కుమార్‌, ఉపేంద్ర, రామకృష్ణ, సావిత్రి వున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 01:06 AM