Share News

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:45 PM

సబ్‌ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు స్థానిక ఏఎస్పీ జేఎన్‌ మహేంద్ర సిన్హ్‌ అన్నారు.

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
తాజంగి నామినేషన్ల కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్పీ మహేంద్ర సిన్హ్‌, సీఐ సింహాచలం, ఎంపీడీవో సీతయ్య

ఏఎస్పీ మహేంద్ర సిన్హ్‌

చింతపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సబ్‌ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు స్థానిక ఏఎస్పీ జేఎన్‌ మహేంద్ర సిన్హ్‌ అన్నారు. ఆదివారం ఎంపీడీవో లాలం సీతయ్య, సీఐ బి. సింహాచలంతో కలిసి మండలంలోని తొమ్మిది నామినేషన్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మూడు మండలాల్లో 66 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఎన్నికల నిర్వహించనున్న పంచాయతీల్లో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు.ప్రతి పంచాయతీలోను అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలింగ్‌ జరిగిన రోజే ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, ఉద్యోగుల తరలింపునకు ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:45 PM