Share News

సీలేరు జలాశయంలో టైగర్‌ రొయ్య లభ్యం

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:11 AM

జీకే వీధి మండలం సీలేరు జలాశయంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడి వలకు టైగర్‌ రొయ్య చిక్కింది. జలాశయంలో మొదటిసారిగా టైగర్‌ రొయ్య చిక్కడంతో అందరూ దీనిని ఆసక్తిగా తిలకించారు.

సీలేరు జలాశయంలో టైగర్‌ రొయ్య లభ్యం
సీలేరు రిజర్వాయర్‌లో లభ్యమైన టైగర్‌ రొయ్య

తొలిసారి చిక్కడంతో అందరిలో ఆసక్తి

సీలేరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం సీలేరు జలాశయంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడి వలకు టైగర్‌ రొయ్య చిక్కింది. జలాశయంలో మొదటిసారిగా టైగర్‌ రొయ్య చిక్కడంతో అందరూ దీనిని ఆసక్తిగా తిలకించారు. కొందరు ఫొటోలు తీసుకున్నారు. స్థానిక జలాశయంలో వివిధ రకాల పెద్ద చేపలే తప్ప రొయ్యలు మత్యకారుల వలకు చిక్కిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో బుధవారం మత్స్యకారుడి వలకు టైరగర్‌ రొయ్య చిక్కడంతో జలాశయంలో టైగర్‌ రొయ్యలు కూడా రానున్న రోజుల్లో లభ్యమయ్యే అవకాశాలున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 16 , 2026 | 12:12 AM