Share News

గజగజ

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:17 PM

మన్యంలో చలి గజగజలాడిస్తోంది. వాతావరణంలోని మార్పులతోపాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి వణికిస్తోంది.

గజగజ
పాడేరులో శనివారం ఉదయం మెయిన్‌రోడ్డులో పొగమంచు

వణికిస్తున్న చలి

శీతల గాలులతో వణుకు

ఆపై దట్టంగా పొగమంచు

అరకులోయలో 7.4 డిగ్రీలు

పాడేరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి గజగజలాడిస్తోంది. వాతావరణంలోని మార్పులతోపాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి వణికిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు సైతం దట్టంగానే కురుస్తోంది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తాజా వాతావరణం మన్యం సందర్శనకు విచ్చేసే పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది.

సింగిల్‌ డిజిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లోనే కొనసాగుతున్నాయి. శనివారం అరకులోయలో 7.4 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జి.మాడుగుల, హుకుంపేటల్లో 8.3, ముంచంగిపుట్టులో 9.6, పెదబయలులో 10.1, చింతపల్లిలో 9.8, కొయ్యూరులో 14.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jan 24 , 2026 | 11:18 PM