ఉరకలేస్తున్న జలపాతాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:24 AM
Thundering waterfalls
ఫిదా అవుతున్న పర్యాటకులు
సెల్‌ఫోన్లలో బంధిస్తున్న సందర్శకులు
సీలేరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. సీలేరు సమీపంలోని ఐస్‌గెడ్డ జలపాతం, ధారాలమ్మ ఆలయం వద్ద ధారకొండ జలపాతం, సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు జలపాతాల అందాలను తమ సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఎత్తైన కొండల పైనుంచి పాల నురగ వలె జూలువారుతున్న జలపాత అందాలను వీక్షిస్తూ ఫిదా అవుతున్నారు. ఇరుముడి సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో పొల్లూరు జలపాతానికి పర్యాటకులు తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది.