కొనసాగుతున్న త్రిసభ్య కమిటీ విచారణ
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:08 AM
స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ సభ్యులు బొకారో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ ప్రియరంజన్, సెయిల్ సీజీఎం జితేంద్రకుమార్, సెయిల్ పూర్వ సీజీఎం గోపాల్‌సింగ్‌లు బుధవారం ఎస్‌ఎంఎస్ విభాగంలో భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
గాజువాక, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ సభ్యులు బొకారో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ ప్రియరంజన్, సెయిల్ సీజీఎం జితేంద్రకుమార్, సెయిల్ పూర్వ సీజీఎం గోపాల్‌సింగ్‌లు బుధవారం ఎస్‌ఎంఎస్ విభాగంలో భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్‌ను కూడా చూశారు. ప్రమాదంపై విభాగం అధికారులతో చర్చించారు. అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడారు. తమ సమస్యలను, జరుగుతున్న పరిణామాలను కార్మికులు ఈ సందర్భంగా కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్లాంటు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కేఎస్‌ఎన్ రావు, నాయకులు టి.సత్యనారాయణ, రమణలతో కూడా కమిటీ సమావేశం కాగా వారు పలు విషయాలను తెలియజేశారు. సమస్యలను ఉక్కు మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను నాయకులు కోరారు.