Share News

కల్యాణపులోవకు త్రిసభ్య కమిటీ

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:13 AM

మండలంలోని కల్యాణపులోవ రిజర్వాయర్‌ గర్భం ఆక్రమణలకు సంబంఽధించి వాస్తవాల వెల్లడికి జిల్లా కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం జలాశయం పరిసరాలను పరిశీలించింది. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ఎస్‌.గోపాలరాజు, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ బాలసూర్యం, రెవెన్యూ శాఖ తరపున తహశీల్దార్‌ అంబేడ్కర్‌ ఇక్కడకు వచ్చి, రిజర్వాయర్‌ హద్దులకు సంబంధించి కొన్ని సర్వే రాళ్లను గుర్తించారు. అయితే వీటి వల్ల పూర్తి స్పష్టత రాదని అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్‌ పూర్తిస్ధాయి నీటి సామర్థ్యానికి సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎల్‌ రిపోర్ట్‌ అవసరమని జలవనరుల శాఖ అధికారికి, సర్వే ఏడీ గోపాలరాజు సూచించారు. దీంతోపాటు రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో భూ సేకరణ రికార్డులు కూడా జలవనరుల శాఖ వద్ద లేకపోవడంపై ఏడీ అసహనం వ్యక్తం చేశారు.

కల్యాణపులోవకు త్రిసభ్య కమిటీ
కల్యాణపులోవ రిజర్వాయర్‌లో చదును చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న త్రిసభ్య కమిటీ

రిజర్వాయర్‌ గర్భం ఆక్రమణల ఫిర్యాదుపై పరిశీలన

జలవనరుల శాఖ వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సర్వే ఏడీ అసహనం

రావికమతం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్యాణపులోవ రిజర్వాయర్‌ గర్భం ఆక్రమణలకు సంబంఽధించి వాస్తవాల వెల్లడికి జిల్లా కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం జలాశయం పరిసరాలను పరిశీలించింది. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ఎస్‌.గోపాలరాజు, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ బాలసూర్యం, రెవెన్యూ శాఖ తరపున తహశీల్దార్‌ అంబేడ్కర్‌ ఇక్కడకు వచ్చి, రిజర్వాయర్‌ హద్దులకు సంబంధించి కొన్ని సర్వే రాళ్లను గుర్తించారు. అయితే వీటి వల్ల పూర్తి స్పష్టత రాదని అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్‌ పూర్తిస్ధాయి నీటి సామర్థ్యానికి సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎల్‌ రిపోర్ట్‌ అవసరమని జలవనరుల శాఖ అధికారికి, సర్వే ఏడీ గోపాలరాజు సూచించారు. దీంతోపాటు రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో భూ సేకరణ రికార్డులు కూడా జలవనరుల శాఖ వద్ద లేకపోవడంపై ఏడీ అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ రిపోర్ట్‌ కోసం ఇప్పటికే థర్డ్‌ పార్టీతో సంప్రదింపులు జరిపామని, భూ సేకరణ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నామని రిజర్వాయర్‌ ఏఈ సూర్య తెలిపారు. దీంతో రిజర్వాయర్‌ ఆక్రమణలపై నివేదికకు మరికొంత సమయం పడుతుందని కమిటీ అభిప్రాయపడింది.

ఇదిలాఉండగా రిజర్వాయర్‌ గర్భం ఆక్రమణకు గురైనట్టు అధికారులకు ఫిర్యాదు చేసిన వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా త్రిసభ్య కమిటీ సర్వేకు రావడం ఏమిటని ఆదివాసీ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి కల్యాణం ఆక్షేపించారు. ఆక్రమణల నిగ్గు తెల్చేందుకు నర్సీపట్నం ఆర్డీవో, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్ట్స్‌ ఏడీ, జలవనరుల శాఖ డీఈలతో త్రిసభ్య కమిటీని కలెక్టర్‌ నియమించగా, నర్సీపట్నం ఆర్డీవో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

Updated Date - Aug 15 , 2026 | 01:13 AM