Share News

జాతీయ హాకీ పోటీలకు ముగ్గురు ఎంపిక

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:46 AM

బాలురు సబ్‌ జూనియర్‌ జాతీయ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ కె.నరేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ హాకీ పోటీలకు ముగ్గురు ఎంపిక
జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన సూర్యప్రదీప్‌, చైతన్య, దేవేందర్‌ వెంకట్‌తో కోచ్‌ లోకేశ్‌

ఎలమంచిలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బాలురు సబ్‌ జూనియర్‌ జాతీయ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ కె.నరేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బిహార్‌ రాష్ట్రం రాజ్‌గిర్‌లో జరుగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఎలమంచిలికి చెందిన కె.సూర్య ప్రదీప్‌, ఎల్‌.చైతన్య, నక్కపల్లికి చెందిన దేవేందర్‌ వెంకట్‌ పాల్గొన్నట్టు పేర్కొన్నారు. హాకీ జట్టు కోచ్‌గా ఎలమంచిలికి చెందిన కె.లోకేశ్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అసోసియేషన్‌ సభ్యులు జి.రాంబాబు, ఎస్‌.రమేశ్‌, డి.మహేశ్‌ అభినందించారు.

Updated Date - Mar 30 , 2026 | 12:46 AM