Share News

మండు వేసవిలో మూడు కాలాలు

ABN , Publish Date - May 09 , 2026 | 10:42 PM

మన్యంలో శనివారం మూడు కాలాలను తలపించే వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కురిసింది. తొమ్మిది గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్రమైన ఎండ కాసింది. తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం పడింది.

మండు వేసవిలో మూడు కాలాలు
జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం

ఉదయం పొగమంచు..

మధ్యాహ్నం వరకు ఎండ..

ఆ తర్వాత వర్షం

పాడేరు, మే 9 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం మూడు కాలాలను తలపించే వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కురిసింది. తొమ్మిది గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్రమైన ఎండ కాసింది. తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం పడింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు ఎండ కాయడం ఆ తర్వాత వర్షం కురవడం సాధారణంగా జరుగుతున్నది. కాని శనివారం అందుకు భిన్నంగా ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, ఆ తర్వాత వర్షం కురవడం విశేషం. అయితే తాజా వాతావరణంతో జనం ఎండ నుంచి కాస్త ఊరట చెందారు.

తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు..

ఏజెన్సీలో వాతావరణంలోని మార్పుల నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. శనివారం కొయ్యూరు 35.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరు, జి.మాడుగుల, జీకేవీధిలో 34.9, అరకులోయలో 32.8, చింతపల్లిలో 32.4, అనంతగిరిలో 31.6, పెదబయలులో 30.9, ముంచంగిపుట్టులో 30.6, హుకుంపేటలో 30.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 09 , 2026 | 10:42 PM