ఒకేరోజు మూడు సీజన్లు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:46 AM
మన్యంలో శుక్రవారం ఒక్కరోజే మూడు సీజన్లు ఆవిష్కృతమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు, మధ్యాహ్నం త్రీవంగా ఎండ, సాయంత్రం పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో భారీ స్థాయిలో వడగళ్ల వర్షం కురవడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా అరకులోయలో 17.1, డుంబ్రిగుడలో 17.6, ముంచంగిపుట్టులో 18.4, పెదబయలులో 18.8, చింతపల్లిలో 19.4, జి.మాడుగులలో 21.1, కొయ్యూరులో 21.9, అనంతగిరిలో 23.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- ఉదయం దట్టంగా పొగమంచు, మధ్యాహ్నం తీవ్రంగా ఎండ, సాయంత్రం వడగళ్ల వాన
పాడేరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం ఒక్కరోజే మూడు సీజన్లు ఆవిష్కృతమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు, మధ్యాహ్నం త్రీవంగా ఎండ, సాయంత్రం పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో భారీ స్థాయిలో వడగళ్ల వర్షం కురవడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా అరకులోయలో 17.1, డుంబ్రిగుడలో 17.6, ముంచంగిపుట్టులో 18.4, పెదబయలులో 18.8, చింతపల్లిలో 19.4, జి.మాడుగులలో 21.1, కొయ్యూరులో 21.9, అనంతగిరిలో 23.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో..
అరకులోయ: మండలంలో భిన్నవాతావరణం నెలకొంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. పానిరంగిని, గద్యగుడ, బల్లగుడలో భారీగా వడగళ్ల వాన కురవడంతో జన జీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సుంకరమెట్ట నుంచి గాలికొండ వ్యూపాయింట్ వరకు రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి కాగా, మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. అయితే భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపునీరు పంటపొలాలకు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.