Share News

టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి స్థానం

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:35 AM

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. టీడీపీ రాష్ట్ర కమిటీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలకు సముచిత స్థానం కల్పించి, కమిటీల్లో పలువురు నేతలకు పదవులను కట్టబెట్టారు.

టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి స్థానం
కిడారి శ్రావణ్‌కుమార్‌ , ఎంవీవీ.ప్రసాద్‌, కె.సుబ్బారావు

కార్యనిర్వాహక కార్యదర్శిగా కిడారి శ్రావణ్‌కుమార్‌

కార్యదర్శులుగా ఎంవీవీ ప్రసాద్‌, కె.సుబ్బారావు

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. టీడీపీ రాష్ట్ర కమిటీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలకు సముచిత స్థానం కల్పించి, కమిటీల్లో పలువురు నేతలకు పదవులను కట్టబెట్టారు. ఈ క్రమంలో జీసీసీ చైర్మన్‌గా ఉన్న కిడారి శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. గతంలో పార్టీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జీసీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించగా, ఈసారి రాష్ట్ర కమిటీలో శ్రావణ్‌కుమార్‌కు కార్యనిర్వాహక కార్యదర్శిగా అవకాశం కల్పించారు. అలాగే కొయ్యూరుకు చెందిన జీసీసీ మాజీ చైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌, పాడేరుకు చెందిన కె.సుబ్బారావులను కార్యదర్శులుగా నియమించారు. జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కడంపై టీడీపీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Apr 16 , 2026 | 01:35 AM