Share News

మూడు ఏకలవ్య స్కూళ్లు ప్రారంభం

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:56 PM

జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న మూడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఆదివారం గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేకాధికారులు ప్రారంభించారు.

మూడు ఏకలవ్య స్కూళ్లు ప్రారంభం
హుకుంపేటలో ఈఎంఆర్‌ఎస్‌ను ప్రారంభిస్తున్న ప్రత్యేకాధికారి జి.జాన్సన్‌ దేవరాజ్‌

పాడేరు, హుకుంపేట, అనంతగిరిలో అందుబాటులోకి...

పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న మూడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఆదివారం గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేకాధికారులు ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఆంగ్లమాధ్యంలో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలానికి రూ.30 కోట్లతో ఒక ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మండలానికి ఒక ప్రత్యేకాధికారిని పంపించి ఆదివారం వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. పాడేరులోని ఈఎంఆర్‌ఎస్‌ను డాక్టర్‌ ఎన్‌జీ.కిశోర్‌బాబు, హుకుంపేటలో జి.జాన్సన్‌ దేవరాజ్‌, అనంతగిరిలో టి.శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రత్యేకాధికారి జాన్స్‌న్‌ దేవరాజ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్‌.చెలయ్య, ఎంఈవోలు బి.విశ్వనాథం, సీహెచ్‌.సరస్వతి, కె.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:56 PM