145 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:07 PM
అనంతగిరి సంతబయలు వద్ద కారులో తరలిస్తున్న 145 కిలోల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కె.శంకరరావు తెలిపారు.
అనంతగిరి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి సంతబయలు వద్ద కారులో తరలిస్తున్న 145 కిలోల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కె.శంకరరావు తెలిపారు. శనివారం సంతబయలు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అరకు వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా.. 145 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న ముంచంగిపుట్టు మండలం వంతల మోహన్‌దాస్, రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పురోహిత్ అర్జున్‌సింగ్, తమిళనాడుకు చెందిన మలైస్వామి చిన్నదేవర్‌లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. కారుతోపాటు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.