జ్ఞానంతో ఆలోచిస్తే ఉన్నత భవిష్యత్తు
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:02 AM
బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.
ప్రముఖ రచయిత యండమూరి
కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. కృష్ణాదేవిపేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో పోలీసు శాఖ, ‘నేనుసైతం’ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏ విషయాన్ని అయితే కంగారుతో ఆలోచించకూడదని, అదే విధంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ప్రధానమని, ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యతే ఎక్కువ వుంటుందని ఆయన అన్నారు. అనంతరం నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు, నాగాపురం గ్రామానికి చెందిన వ్యాపారి బొప్పన హరిబాబు ఆర్థిక సాయంతో సమకూర్చిన క్రీడా దుస్తులను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ వి.రుషికేశ్వరరావు, ‘నేను సైతం’ సంస్థ చైర్మన్ కుసిరెడ్డి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.