Share News

కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:12 AM

జిల్లాలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. పాడేరుతో సహ పలు మండలాల్లో శనివారం ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు ప్రభావానికి వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు.

కమ్మేసిన పొగమంచు
పాడేరు-నక్కలపుట్టు రహదారిలో శనివారం ఉదయం పొగమంచు

- ఉదయం 9 గంటల వరకు వీడని మంచు తెర

పాడేరురూరల్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. పాడేరుతో సహ పలు మండలాల్లో శనివారం ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు ప్రభావానికి వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు. సాయంత్రం 6 గంటల నుంచి మంచు తీవ్రత పెరగడంతో రాత్రి వేళ చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శనివారం కొయ్యూరులో 37.0, అరకులోయలో 36.6, జి.మాడుగులలో 35.2, చింతపల్లిలో 33.2, పెదబయలులో 32.7, ముంచంగిపుట్టులో 31.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 29 , 2026 | 01:12 AM