కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:51 PM
మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఉదయం వేళల్లో మాత్రం పొగమంచు దట్టంగానే కురుస్తున్నది.
ఉదయం 8 గంటల వరకు వీడని మంచు తెరలు
పాడేరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఉదయం వేళల్లో మాత్రం పొగమంచు దట్టంగానే కురుస్తున్నది. ఏజెన్సీలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కమ్మేసింది. స్థానిక ఘాట్ మార్గంలో అయితే పది గంటల వరకు పొగమంచు కొనసాగడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. ముంచంగిపుట్టులో 13.5, అరకులోయలో 13.9, చింతపల్లిలో 14.1, పెదబయలులో 15.7, జి.మాడుగులలో 16.5, కొయ్యూరులో 17.9, అనంతగిరిలో 19.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ చలి ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గలేదు.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 10 గంటల వరకు భానుడు కనిపించలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది.