ఈఏపీసెట్‌లో సత్తాచాటారు
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:38 AM
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2026లో జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పరీక్షకు జిల్లా నుంచి 23,954 మంది హాజరు కాగా, 17,308 మంది (72.25 శాతం) అర్హత సాధించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ
విభాగాల్లో పలువురికి మంచి ర్యాంకులు
ఇంజనీరింగ్‌లో 65, 118, 152, 162, 165,
అగ్రికల్చర్‌లో 30, 31, 32, 38, 40, 50, 75, 76 ర్యాంకులు
జిల్లా టాపర్లు ఇంజనీరింగ్‌లో
చెరుకూరి గీతా ప్రణవి,
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో
పెంటకోట హైంధవి
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2026లో జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పరీక్షకు జిల్లా నుంచి 23,954 మంది హాజరు కాగా, 17,308 మంది (72.25 శాతం) అర్హత సాధించారు.
మహారాణిపేట ప్రాంతానికి చెందిన చెరుకూరి గీతాప్రణవి 85.25 స్కోరుతో రాష్ట్ర స్థాయిలో 65వ ర్యాంకు సాధించగా, జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. అలాగే, పద్మనాభం మండలం పాత కొవ్వాడ గ్రామానికి చెందిన టీహెచ్‌ఎస్‌ఎం కౌశిక 81.8 స్కోరుతో రాష్ట్ర స్థాయిలో 118వ ర్యాంకు (జిల్లాలో రెండో ర్యాంకు), పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన బండారు వంశీకృష్ణ 79.88 స్కోరుతో 152వ ర్యాంకు (జిల్లా స్థాయిలో మూడు) సాధించారు. అదేవిధంగా లాసన్స్‌బే కాలనీకి చెందిన బేతా సాయిఆశిక్ 79.33 స్కోరుతో జిల్లాలో స్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 162, మధురవాడ ప్రాంతానికి చెందిన శరగడం శ్రావణ్ 79.1 స్కోరుతో జిల్లా స్థాయిలో ఐదు, రాష్ట్రస్థాయిలో 165, అగనంపూడి ప్రాంతానికి చెందిన సూరిశెట్టి కార్తికేయ 78.23 స్కోరుతో జిల్లాలో ఆరు, రాష్ట్రస్థాయిలో 191, భీమునిపట్నం మండలం జీరుపేట గ్రామానికి చెందిన జోగు సౌమ్యశ్రీ 78.134 స్కోరుతో జిల్లాలో ఏడు, రాష్ట్ర స్థాయిలో 195 ర్యాంకు,నగరంలోని డాబాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన మండరాపు రేవంత్ కార్తికేయ 77.9 స్కోరుతో జిల్లా స్థాయిలో ఎనిమిది, రాష్ట్ర స్థాయిలో 206 ర్యాంకు, పద్మనాభం మండలం పెంట గ్రామానికి చెందిన కరింరెడ్డి శ్రీవల్లి 77.3 స్కోరుతో జిల్లాలో తొమ్మిది, రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు, నగర పరిధి చినముషిడివాడకు చెందిన కన్నూరు సుశాంత్ 77.07 స్కోరుతో జిల్లా స్థాయిలో పది, రాష్ట్ర స్థాయిలో 235 ర్యాంకు సాధించి సత్తా చాటారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగ ర్యాంకర్లు
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో నిర్వహించిన పరీక్షకు జిల్లా నుంచి 7,315 మంది హాజరు కాగా 6,439 మంది (88.02 శాతం) అర్హత సాధించారు. వీరిలో గాజువాక ప్రాంతానికి చెందిన పెంటకోట హైంధవి 86.7 స్కోరుతో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంకు, సీతమ్మధారకు చెందిన కొల్లి రోహిత్ 86.65 స్కోరుతో జిల్లాలో రెండు, రాష్ట్ర స్థాయిలో 31, మహారాణిపేటకు చెందిన గొర్రెల సంపత్ దీక్షిత్ 86.6 స్కోరుతో జిల్లాలో మూడు, రాష్ట్ర స్థాయిలో 32, మధురవాడకు చెందిన కామిరెడ్డి జ్ఞానవెంకట్ 86.26 స్కోరుతో జిల్లాలో నాలుగు, రాష్ట్ర స్థాయిలో 38, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యడ్ల శ్రావణి 85.95 స్కోరుతో జిల్లాలో ఐదు, రాష్ట్ర స్థాయిలో 40వ ర్యాంకు సాధించారు. అలాగే, నగర పరిధి మహారాణిపేటకు చెందిన అనిమేష్ దాస్ 85.62 స్కోరుతో జిల్లా స్థాయిలో ఆరు, రాష్ట్ర స్థాయిలో 50, సీతమ్మధారకు చెందిన ఎస్.రిషి రాజశేఖరం 83.99 స్కోరుతో జిల్లాలో ఏడు, రాష్ట్ర స్థాయిలో 75వ ర్యాంకు, రేసపువానిపాలెం ప్రాంతానికి చెందిన పీవీఎస్‌ఎస్ శశిధర్ 83.95 స్కోరుతో జిల్లాలో ఎనిమిది, రాష్ట్రస్థాయిలో 76, సీతమ్మధారకు చెందిన సుమేధ నేమాని 83.9 స్కోరుతో జిల్లాలో తొమ్మిది, రాష్ట్ర స్థాయిలో 78, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన కంచిపాటి ఝాన్సీరాణి 83.54 స్కోరుతో జిల్లా స్థాయిలో పదో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 85వ ర్యాంకు సాధించారు.