Share News

మెయిన్స్‌లో మెరిశారు

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:19 AM

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రెండు విడతలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ఫైనల్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

మెయిన్స్‌లో మెరిశారు

100లోపు పలు ర్యాంకులు

జాతీయ స్థాయిలో 46, 56, 58, 85వ ర్యాంకులు సాధించిన విశాఖ విద్యార్థులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రెండు విడతలుగా

నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ఫైనల్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

ఈ ఏడాది జనవరిలో తొలిదశ, ఈ నెలలో రెండో దశ పరీక్షలు నిర్వహించారు. రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా మెయిన్స్‌లో నిర్దేశిత మార్కులు వచ్చిన వారందరికీ ఐఐటీలలో సీట్లకోసం వచ్చే నెల 17వ తేదీన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా సోమవారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీ, రిజర్వేషన్ల వారీగా ర్యాంకులు కేటాయించారు. జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో శ్రీచైతన్య ఐఐటీ అకాడమీకి చెందిన కాటా హిమఖర్‌ 46వ ర్యాంకు, పి.భార్గవ

నాయుడు 58వ ర్యాంకు, ఎం.నాగసహస్ర 85వ ర్యాంకు సాధించారు. అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకున్న గోవింద పాండేకు 46వ ర్యాంకు, కె.కనిష్కకు 113వ ర్యాంకు, బి.ధీరజ్‌కు 185వ ర్యాంకు, వెచ్చా వెంకటసాయి లోకేశ్‌ 323వ ర్యాంకు, అల్లు రోహిత్‌ 444వ ర్యాంకు సాధించారు. ఇంకా నగరంలో అసెంట్‌, శ్రీవిశ్వ, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకుల వివరాలు అందాల్సి ఉంది. నగరంలో సుమారు 1,000 నుంచి 1,500 మంది వరకు మంచి ర్యాంకులు సాధించి ఉంటారని కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రతినిధి ఒకరు తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 01:19 AM