ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:05 AM
జిల్లాలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఎంపిక చేసిన కేంద్రాల్లోని స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచారు. జిల్లాలోని 24 మండలాల ఓట్ల లెక్కింపు కోసం ఏడు కేంద్రాల్లో పది స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఏ మండలం ఓట్లు.. ఎక్కడ లెక్కింపు జరుగుతాయంటే..
అనకాపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఎంపిక చేసిన కేంద్రాల్లోని స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచారు. జిల్లాలోని 24 మండలాల ఓట్ల లెక్కింపు కోసం ఏడు కేంద్రాల్లో పది స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఏ మండలం ఓట్లు.. ఎక్కడ లెక్కింపు జరుగుతాయంటే..
అనకాపల్లి, బుచ్చెయ్యపేట, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం మండలాలకు అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల
చోడవరం మండలానికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల
దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలకు దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల
నక్కపల్లి మండలానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల
పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాలకు నక్కపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల
మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట మండలాలకు నర్సీపట్నం మునిసిపాలిటీ పెదబొడ్డేపల్లిలోని డాన్‌బాస్కో స్కూలు
గొలుగొండ, నాతవరం, రావికమతం, కోటవురట్ల మండలాలకు నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల
వి.మాడుగుల, చీడికాడ మండలాలకు వి.మాడుగులలోని సెయింటాన్స్ ఇంగ్లిషు మీడియం స్కూలు
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు ఎలమంచిలిలో ఇండోర్ స్టేడియం
ఎలమంచిలి మండలానికి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల