పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:42 AM
నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అసత్యమని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆయన బుధవారం రేసపువానిపాలెంలోని హెచ్‌పీసీఎల్ బంక్‌ను తనిఖీ చేశారు. నిల్వలపై స్టాకు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అధికారుల నుంచి అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం
కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
రేసపువానిపాలెం బంక్ తనిఖీ
విశాఖపట్నం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అసత్యమని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆయన బుధవారం రేసపువానిపాలెంలోని హెచ్‌పీసీఎల్ బంక్‌ను తనిఖీ చేశారు. నిల్వలపై స్టాకు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అధికారుల నుంచి అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 123 బంకులు ఉండగా, ఎక్కడా ఇంధన కొరత లేదన్నారు. ఒకటి, రెండు బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ లేకపోవడంతో కొరత ఉందనే అపోహలు వచ్చాయన్నారు. హెచ్‌పీసీఎల్, బీసీపీ, ఐవోసీ కంపెనీల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఇంధనం తీసుకోవాలని, అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఇంధన సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు, సహాయ పౌరసరఫరాల అధికారి కల్యాణి, తూనికలు, కొలతల అధికారులు అప్పలరాజు, దామోదరనాయుడు, హెచ్‌పీసీఎల్ సేల్స్ అధికారి యామిని ఉన్నారు.
పోలమాంబ గుడి వద్ద బంకు తనిఖీ చేసిన జేసీ
జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి బుధవారం పెదవాల్తేరులోని పోలమాంబ అమ్మవారి గుడి సమీపాన గల పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్‌ను పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు. ఇంధనం కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టంచేశారు.