Share News

జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:38 AM

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో జిల్లాలోని పంచాయతీల్లో అధికారులు ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లున్నారని అధికారులు ప్రకటించారు.

జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు
కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ఓటరు జాబితాను ప్రదర్శిస్తున్న ప్రత్యేకాధికారి రామకృష్ణ

పురుషులు: 2, 41,447, మహిళలు: 2,56,997, ఇతరులు: 23 మంది

ఈసీ ఆదేశాలతో పంచాయతీల్లో ఓటరు జాబితాల ప్రదర్శన

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో జిల్లాలోని పంచాయతీల్లో అధికారులు ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లున్నారని అధికారులు ప్రకటించారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు.. మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 3,460 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే పురుషులు 2 లక్షల 41 వేల 447 మంది, మహిళలు 2 లక్షల 56 వేల 997 మంది, ఇతరులు 23 మంది.. మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లున్నారని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌ తెలిపారు. అలాగే జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65 వేల 374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38 వేల 286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. బుధవారం ప్రతి పంచాయతీ కేంద్రంలో ఓటరు జాబితాల ప్రదర్శన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు సూచించడంతో ఆ ప్రక్రియను నిర్వహించారు. అయితేప్రస్తుతం సర్పంచుల కాల పరిమితి ముగియడం ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలుండడంతో ఎన్నికలపై అందరి దృష్టిపడింది.

Updated Date - Apr 16 , 2026 | 01:38 AM