‘పేట కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
ABN , Publish Date - May 05 , 2026 | 12:58 AM
స్థానిక దుర్గానగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000ల హుండీలో భక్తులు వేసిన కానుకల సొమ్మును అపహరించుకుపోయారు.
4.5 తులాల బంగారం, హుండీ కానుకలు అపహరణ
పాయకరావుపేట, మే 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక దుర్గానగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000ల హుండీలో భక్తులు వేసిన కానుకల సొమ్మును అపహరించుకుపోయారు. సీఐ ఎస్.శంకరరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆలయ పూజారి రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం ఆలయానికి తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం పూజలు చేయడానికి రాగా, ప్రధాన గేటు, గర్భగడి తలుపులు తీసివున్నాయి. కీడు శంకించిన ఆయన లోపలికి వెళ్లి చూడగా కానుకల హుండీ కనిపించలేదు. అమ్మవారికి అలంకరించిన మూడు జతల మంగళ సూత్రాలు, బంగారు గొలుసు కలిపి సుమారు నాలుగున్నర తులాల బంగారం వస్తువులు కూడా లేవు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో సుమారు రూ.50 వేల వరకు కానుకల సొమ్ము వుంటుందని పేర్కొన్నారు. క్లూస్ టీమ్ వచ్చి వేలి ముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు