Share News

పాడేరు సబ్‌ పోస్టాఫీసులో చోరీ

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:24 AM

జిల్లా కేంద్రం పాడేరు పట్టణం నడిబొడ్డులోని అంబేడ్కర్‌ కూడలి సమీపంలో ఉన్న సబ్‌ పోస్టాఫీసులో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.1.7 లక్షల నగదు అపహరణకు గురైంది.

పాడేరు సబ్‌ పోస్టాఫీసులో చోరీ
సబ్‌ పోస్టాఫీసులో లాకర్‌ పగులగొట్టిన దృశ్యం

- రూ.1.7 లక్షలు అపహరణ

పాడేరురూరల్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరు పట్టణం నడిబొడ్డులోని అంబేడ్కర్‌ కూడలి సమీపంలో ఉన్న సబ్‌ పోస్టాఫీసులో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.1.7 లక్షల నగదు అపహరణకు గురైంది. దీనికి సంబంధించి సీఐ శిరిపురపు రామారావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సోమవారం అర్థరాత్రి తరువాత పాడేరు సబ్‌ పోస్టాఫీసు తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి పురాతన నగదు లాకర్‌ను కూడా పగులగొట్టారు. అందులోని రూ.1.7 లక్షల నగదును అపహరించారు. మంగళవారం ఉదయం సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో కార్యాలయ ప్రధాన గేటు తాళాలు పగులకొట్టి ఉండటంతో పోస్టల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులకు సబ్‌ పోస్టు మాస్టర్‌ వడ్డే సింహాచలం ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పోస్టాఫీసు పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామారావు తెలిపారు.

Updated Date - Aug 12 , 2026 | 12:24 AM