Share News

మన్యం గజగజ

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:40 AM

మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు.

మన్యం గజగజ
ముంచంగిపుట్టులో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో దట్టంగా పొగమంచు

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న చలి తీవ్రత

పాడేరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం పది గంటల తరువాత నుంచి సాధారణ వాతావరణం నెలకొంది. అయితే సాయంత్రం నాలుగు గంటల తరువాత నుంచి చలి ప్రభావం చూపింది. సోమవారం కొయ్యూరులో 18.0, పాడేరులో 16.5, జీకేవీధిలో 16.2, అరకులోయలో 15.8, డుంబ్రిగుడలో 15.5, చింతపల్లి, హుకుంపేటలో 15.1, పెదబయలు, చింతపల్లిలో 15.0, ముంచంగిపుట్టులో 14.5డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ఉదయం 10 గంటల వరకు మండల కేంద్రంతో పాటు పలు చోట్ల పొగమంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:40 AM