Share News

రైళ్లకు అదే రద్దీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:43 AM

రైళ్లపై సంక్రాంతి తిరుగు ప్రయాణికుల ప్రభావం తీవ్రంగా పడింది. విశాఖ నుంచి ఒరిజినేటింగ్‌ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లపై రద్దీ ప్రభావం పడింది.

రైళ్లకు అదే రద్దీ

సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో అన్ని రైళ్లకు బెర్తులు ఫుల్‌

ఆదివారం దాదాపు అన్ని రైళ్లకు రిగ్రెట్‌

చెన్నై, బెంగళూరు, హౌరా రైళ్లు నెలాఖరకు వరకు ఫుల్‌

సికింద్రాబాద్‌ రైళ్లకు ఈనెల 27 వరకు బెర్తులు నిల్‌

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

రైళ్లపై సంక్రాంతి తిరుగు ప్రయాణికుల ప్రభావం తీవ్రంగా పడింది. విశాఖ నుంచి ఒరిజినేటింగ్‌ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లపై రద్దీ ప్రభావం పడింది. సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, హౌరా, భువనేశ్వర్‌, ఎర్నాకులం రైళ్లకు రద్దీ నెలకొంది. ముందస్తు రిజర్వేషన్‌తో బెర్తులు పొందిన ఆరు మినహా నిరీక్షణ జాబితాకు పరిమితమైనవారంతా తిరుగు ప్రయాణంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రత్యమ్నాయ రవాణా ద్వారా వచ్చిన వారు తిరుగు ప్రయాణానికీ మరో మార్గం చూసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అత్యధిక శాతం తిరుగు ప్రయాణికులు ఆదివారం (18న)బయలుదేరేందుకు సిద్ధమవడంతో సికింద్రాబాద్‌, చర్లపల్లి, మహబూబ్‌నగర్‌ వెళ్లే గోదావరి, గరీబ్‌రథ్‌ ఎల్‌టీటీ, తదితర రైళ్లకు రిగ్రెట్‌ ఏర్పడింది. చెన్నై, హౌరా మెయిల్‌, కోరామాండ్‌ ఎక్స్‌ప్రెస్‌లు, బెంగళూరు వెళ్లే ప్రశాంతి, వారాంతపు, బై వీక్లీ రైళ్లకు రిగ్రెట్‌ కనిపిస్తోంది. చర్లపల్లి, బెంగళూరు, తిరుపతి, రైల్వే అధికారులు దువ్వాడ మీదుగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు జనవరి 18, 19న బెర్తులు నిండిపోయాయి.

సికింద్రాబాద్‌కు 27 వరకు బెర్తులు ఫుల్‌

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), వందేభారత్‌ (20833), గరీబ్‌రథ్‌ (12739), దురంతో (22203), జన్మభూమి (12805), విశాఖ-ఎల్‌టీటీ (18519),విశాఖ-మహబూబ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12861), విశాఖ-నాందేడు సూపర్‌ఫాస్ట్‌ (20811) రైళ్లతోపాటు విశాఖ-సికింద్రాబాద్‌ వీక్లీ (12783)కి ఈనెల 27 వరకు బెర్తులు నిండిపోయాయి. విశాఖ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే కోణార్క్‌ (11020), ఫలక్‌నూమా (12703), ఈస్ట్‌కోస్ట్‌ (18045) రైళ్లకు తీవ్ర డిమాండ్‌ నెలకొంది.

చెన్నై రైళ్లకు ఫిబ్రవరి 8 వరకు

విశాఖ మీదుగా చెన్నై వెళ్లే కోరమాండల్‌ (12841), మెయిల్‌ (12839), బొకారో (13351), టాటా-ఎర్నాకులం (18189) రైళ్లకు ఫిబ్రవరి 8వరకు బెర్తులు నిండిపోయాయి. విశాఖ-చెన్నై (22801), హౌరా-కన్యాకుమారి (12665), భువనేశ్వర్‌-పాండిచ్చేరి (12898), భువనేశ్వర్‌-చెన్నై (12830), భువనేశ్వర్‌-చెన్నై (20853), షాలిమార్‌-చెన్నై (22825) రైళ్లకు జనవరి నెలాఖరు వరకు బెర్తులు లేవు. భువనేశ్వర్‌-బెంగుళూరు ప్రశాంతి (18463)కి ఫిబ్రవరి 9 వరకు, హౌరా-బెంగుళూరు (12863) రైలుకు ఫిబ్రవరి 15 వరకు బెర్తులు నిండిపోయి విశాఖ-బెంగుళూరు స్పెషల్‌ (08543), భువనేశ్వర్‌-బెంగుళూరు హంసఫర్‌ (22833), హౌరా-బెంగుళూరు హంసఫర్‌ (22887), హౌరా-బెంగుళూరు దురంతో (12245), హటియా-బెంగుళూరు (12835), గుహవటి-బెంగుళూరు (12510), భగల్‌పూర్‌-బెంగుళూరు అంగా (12254), అగర్తల-బెంగుళూరు హంసఫర్‌ (12504), కామాఖ్య-బెంగుళూరు (12552), పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ (22833), టాటా-యశ్వంత్‌పూర్‌ (18111), జసిదిన్‌ జంక్షన్‌-బెంగుళూరు (22306), టాటా-బెంగుళూరు (12889), హౌరా-మైసూర్‌ (22817), భువనేశ్వర్‌-బెంగుళూరు (12845), హటియా-బెంగుళూరు (18637), న్యూ టిన్సుకియా-బెంగుళూరు (22502), హౌరా-బెంగుళూరు (22863), ముజాఫర్‌పూర్‌-బెంగుళూరు (15228) రైళ్లకు డిమాండ్‌ ఏర్పడింది.

హౌరా రైళ్లకు డిమాండ్‌

విశాఖ మీదుగా హౌరా వెళ్లే కోరమాండల్‌ (12842), మెయిల్‌ (12840), ఫలక్‌నూమా (12704), ఈస్ట్‌కోస్ట్‌ (18046), బెంగళూరు-హౌరా (12864), కన్యాకుమారి-డిబ్రుగర్‌-హౌరా వివేక్‌ (22503) రైళ్లకు ఫిబ్రవరి 3 వరకు అన్ని క్లాసుల బెర్తులు నిండిపోయాయి. ప్రతి బుధవారం విశాఖ నుంచి షాలిమార్‌ వెళ్లే రైలుకు (22854) కూడా ఫిబ్రవరి 4 వరకు బెర్తులు లేవు. వాస్కోడిగమ-షాలిమార్‌ (18048), బెంగళూరు-అగర్తల (12503), చెన్నై-సంత్రాగచ్చి (22803), పాండిచ్చేరి-హౌరా (12868), బెంగళూరు-ముజాఫర్‌పూర్‌ (15227) రైళ్లకు జనవరి నెలాఖరు వరకు డిమాండ్‌ ఏర్పడింది.

రేపు విశాఖ- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తిరుగు ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టామని సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. 08517 నంబరు గల ప్రత్యేక రైలు ఈనెల 18న (ఆదివారం) మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 08518 నంబరు గల ప్రత్యేక రైలు ఈనెల 19న (సోమవారం) ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి అదేరోజు అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Jan 17 , 2026 | 12:43 AM