Share News

చుర్రుమనిపించిన సూరీడు

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:10 PM

మన్యంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం వేళల్లో బయట సంచరించలేని పరిస్థితి ఏర్పడుతుండడంతో మెయిన్‌ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి.

చుర్రుమనిపించిన సూరీడు
శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న పాడేరు-విశాఖపట్నం మెయిన్‌ రోడ్డు

నిర్మానుష్యంగా మారిన రోడ్లు

బయటకు రావడానికి భయపడిన జనం

కొయ్యూరులో అత్యధికంగా 37.4 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం వేళల్లో బయట సంచరించలేని పరిస్థితి ఏర్పడుతుండడంతో మెయిన్‌ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెల్లవారుజామున కాస్తా చల్లదనంగా ఉంటున్నప్పటికీ, మిగిలిన సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఏజెన్సీలో శనివారం కొయ్యూరులో 37.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయ, జి.మాడుగులలో 36.3, చింతపల్లిలో 34.1, హుకుంపేటలో 33.0, పెదబయలులో 32.8, అనంతగిరిలో 32.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 11 , 2026 | 11:10 PM