Share News

ఎండ ప్రతాపం....

ABN , Publish Date - May 01 , 2026 | 12:26 AM

మన్యంలోనూ ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. వేడి వాతావరణానికి జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు.

ఎండ ప్రతాపం....
ఎండకు రద్దీగా లేని పాడేరు- చింతపల్లి మెయిన్‌రోడ్డు

అరకులోయలో 37.2 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): మన్యంలోనూ ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. వేడి వాతావరణానికి జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఏజెన్సీలో ఎండల ప్రభావం కన్పిస్తున్నది. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఘోరంగా ఉండడంతో బయట తిరిగేందుకు జనం భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు కూడా గొడుగులు వేసుకుంటున్నారు. శీతలపానీయాలు, జ్యూస్‌ సెంటర్ల వద్ద కొద్దిగా రద్దీ కనిపిస్తున్నది. రాత్రి, పగలు సైతం ఉక్కపోత కొనసాగుతున్నది. గురువారం అరకులోయలో 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా కొయ్యూరులో 36.5, పాడేరు, డుంబ్రిగుడలో 36.4, జి.మాడుగులలో 35.1, అనంతగిరిలో 34.9, చింతపల్లి, పెదబయలులో 33.8, హుకుంపేటలో 32.7, ముంచంగిపుట్టులో 32.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 01 , 2026 | 12:26 AM