బాబోయ్ ఎండలు
ABN , Publish Date - May 23 , 2026 | 11:19 PM
మన్యంలో శనివారం ఎండ తీవ్రంగా కాసింది. దీంతో ఏజెన్సీ వాసులు అల్లాడిపోయారు.
ఉదయం నుంచే మంటలు
కొయ్యూరులో 42.6.. పాడేరులో 40.9 డిగ్రీలు
పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం ఎండ తీవ్రంగా కాసింది. దీంతో ఏజెన్సీ వాసులు అల్లాడిపోయారు. ఆపై ఉక్కపోతతో విలవిలలాడారు. శనివారం ఉదయం నుంచే ఎండ తీవ్రత ప్రభావం అధికంగా ఉండగా.. మధ్యాహ్నానికి మరింతగా తీవ్రమైంది. ఆ తర్వాత ఆకాశం మబ్బులు పట్టడడంతో ఎండ తీవ్రత తగ్గినట్టుగా అనిపించింది. కానీ వేడి, ఉక్కపోత మాత్రం తగ్గలేదు. గత మూడు రోజులుగా ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో మైదాన ప్రాంతానికి దీటుగానే ఏజెన్సీలోనూ వేడి వాతావరణం కొనసాగుతున్నది. మన్యంలో శనివారం కొయ్యూరులో 42.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరు, పెదబయలు, జీకేవీధి, జి.మాడుగుల, డుంబ్రిగుడలో 40.9, చింతపల్లిలో 39.6, అరకులోయలో 39.4, అనంతగిరిలో 37.7, హుకుంపేటలో 35.5, ముంచంగిపుట్టులో 34.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.