పుణ్యస్నానానికి పాట్లు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:40 AM
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచదార్లలోని శ్రీరాధామాధవస్వామి ఆలయ గర్భంలో ప్రవహిస్తున్న ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు శనివారం ఉదయం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
- పంచదార్ల పుణ్యక్షేత్రంలోని ఆకాశధార వద్ద స్వల్ప తోపులాట
- నీళ్ల క్యాన్లతో ఇబ్బంది పెట్టిన స్థానికులు
- పట్టించుకోని ఆలయ అధికారులు
రాంబిల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి ): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచదార్లలోని శ్రీరాధామాధవస్వామి ఆలయ గర్భంలో ప్రవహిస్తున్న ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు శనివారం ఉదయం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్నానాలు ఆచరించడానికి వెళుతున్న భక్తులను నెట్టుకుంటూ స్థానికులు నీళ్ల క్యాన్లతో రావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇదేమిటని వారిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా స్పందించి పుణ్యస్నానాలు ఆచరించే ప్రాంతంలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, తోపులాట జరగకుండా సిబ్బందిని నియమించాలని భక్తులు కోరుతున్నారు.