రాష్ట్రం నెంబర్ వన్ కావాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:58 PM
శాంతమ్మదేవి ఆశీస్సులు రాష్ట్రంపైన ఉండాలని, దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి
శాంతమ్మదేవి అమ్మవారిని కోరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అరకులోయ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): శాంతమ్మదేవి ఆశీస్సులు రాష్ట్రంపైన ఉండాలని, దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం ఉదయం అరకులోయ సమీపంలోని యండపల్లివలస శాంతమ్మదేవి అమ్మవారి ఆలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ హుండీలో డబ్బులు వేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడారు. భావితరాల వారికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచేంతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాల సహకరిస్తున్నారన్నారు. నర్సీపట్నంలో ఉంటున్న త్రినాథ్, నా తల్లిదండ్రులు 40 ఏళ్ల క్రితం ఇక్కడ శాంతమ్మదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారన్నారు. ఈ ఆలయాన్ని తాను గత 15 ఏళ్లుగా సందర్శించి, అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నానన్నారు. శాంతమ్మదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. ఈ పండగకు గత రెండేళ్లు నుంచి రాలేకపోయానని, తనకు కొంతఇబ్బందిగా అనిపించిందన్నారు. ఇటీవల త్రినాథ్ కుటుంబ సభ్యులు అమ్మవారి పండుగకు రావాలని ఆహ్వానించడంతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయనతోపాటు ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, ఆయన సతీమణి, ఆలయ నిర్వాహకులు త్రినాథ్ కుటుంబ సభ్యులు, టీడీపీ మండల అధ్యక్షుడు మమాదేవ్, మాజీసర్పంచ్ దాసుబాబు, ఏఎంసీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, మహిళా నాయకురాలు బూర్జ లక్ష్మి, సీవేరి ఇచ్చావతి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక సీఐ హిమగిరి, ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.