ఠారెత్తించిన ఎండలు
ABN , Publish Date - May 23 , 2026 | 11:37 PM
జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. శనివారం మాకవరపాలెంలో 45.5, కశింకోట 43.4, నాతవరం, నక్కపల్లి 43.3, గొలుగొండ 43.1, నర్సీపట్నం 43, ఎస్.రాయవరం 42.7, పాయకరావుపేట 42.2, కోటవురట్ల 42, బుచ్చెయ్యపేట 41.6, మునగపాక 41.3, దేవరాపల్లి 40.8, రావికమతం, రోలుగుంట, రాంబిల్లి 40.7, ఎలమంచిలి 40.2, కె.కోటపాడు 40, అనకాపల్లి, సబ్బవరం 39.5, మాడుగుల 39.3, చోడవరం 38.9, అచ్యుతాపురం 38.8, చీడీకాడలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు
అనకాపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. శనివారం మాకవరపాలెంలో 45.5, కశింకోట 43.4, నాతవరం, నక్కపల్లి 43.3, గొలుగొండ 43.1, నర్సీపట్నం 43, ఎస్.రాయవరం 42.7, పాయకరావుపేట 42.2, కోటవురట్ల 42, బుచ్చెయ్యపేట 41.6, మునగపాక 41.3, దేవరాపల్లి 40.8, రావికమతం, రోలుగుంట, రాంబిల్లి 40.7, ఎలమంచిలి 40.2, కె.కోటపాడు 40, అనకాపల్లి, సబ్బవరం 39.5, మాడుగుల 39.3, చోడవరం 38.9, అచ్యుతాపురం 38.8, చీడీకాడలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు దివ్యాంగుడి మృతి
రావికమతం: వడదెబ్బకు గురై మండలంలోని కేబీపీ అగ్రహారం గ్రామానికి చెందిన గడిగోయ్యల సత్యనారాయణ(28) అనే దివ్యాంగ యువకుడు శనివారం మృతి చెందాడు. ఎండల తీవ్రత వల్ల అతను రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. శనివారం ఉదయం అతను కోలుకున్నాడన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఉపాధి పనులకు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి చూసేసరికి అతను స్పృహ తప్పి పడి ఉన్నాడు. సపర్యలు చేయడంతో స్పృహలోకి వచ్చి ఊపిరి అందడం లేదని చెప్పాడు. ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఈ విషయాన్ని వీఆర్వోకు అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు.