ఠారెత్తించిన ఎండలు
ABN , Publish Date - May 14 , 2026 | 12:57 AM
జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు ఠారెత్తించాయి. దీంతో మధ్యాహ్నం వేళ జన సంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
దేవరాపల్లిలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
అనకాపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు ఠారెత్తించాయి. దీంతో మధ్యాహ్నం వేళ జన సంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దేవరాపల్లి మండలంలో 41.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మాకవరపాలెంలో 41.2, నాతవరం, నర్సీపట్నంలో 38.8, చోడవరంలో 38.6, రోలుగుంట, రావికమతంలో 38.5, కశింకోటలో 38.4, బుచ్చెయ్యపేటలో 38.2, మాడుగులలో 37.8, చీడికాడలో 37.6, కె.కోటపాడులో 37.5, పరవాడ, సబ్బవరం, గొలుగొండలో 37.2, మునగపాకలో 37.1, కోటవురట్లలో 36.7, అనకాపల్లి లో 36.4, ఎస్.రాయవరంలో 35.6, పాయకరావుపేట, రాంబిల్లిలో 35.3, నక్కపల్లిలో 34.7, అచ్యుతాపురంలో 34.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.