Share News

రోడ్డంతా బురద

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:19 PM

మండలంలోని మంప- పైడిపణుకులు రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు బురద మయంగా మారింది. రెండున్నర కిలోమీటర్ల మేర చిత్తడిగా ఉంది.

రోడ్డంతా బురద
బురదమయంగా మంప- పైడిపణుకుల రహదారి

రాకపోకలకు పైడిపణుకులు గ్రామస్థుల ఇబ్బందులు

కొయ్యూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మంప- పైడిపణుకులు రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు బురద మయంగా మారింది. రెండున్నర కిలోమీటర్ల మేర చిత్తడిగా ఉంది. దీంతో కనీసం నడిచి వెళ్లాలన్నా అవకాశం లేకుండాపోయింది. ఈ రహదారిని బీటీ రోడ్డుగా మార్పు చేసేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనలో నిధులు మంజూరయ్యాయి. అయితే పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం(ప్రాజెక్ట్సు) సిబ్బంది ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పైడిపణుకుల గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:19 PM